Samantha: స‌మంత ఓవ‌ర్ చేస్తోందా?

మరిన్ని వార్తలు

'స‌మంత‌కు గాయాలు.'. అనే హెడ్డింగుతో ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ఈరోజు వార్త‌లొచ్చాయి. స‌మంత కూడా ఇన్‌స్టాలో.. త‌న చేతికి గాయాలైన ఫొటోల్ని పోస్ట్ చేసింది. తీరా చూస్తే... చేతులు అక్క‌డ‌క్క‌డ కాస్త గీసుకొన్నాయంతే. దానికి `గాయాలు` అంటూ పెద్ద మాట వాడేస్తున్నారంతా. స‌మంత ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే సిరీస్ అది. అందుకోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకొంది. త‌న‌పై కొన్ని యాక్ష‌న్ సీన్లు తెర‌కెక్కిస్తున్న నేప‌థ్యంలో.. చేతులు కాస్త కందిపోయాయి. అంతే. దానికి స‌మంత పోస్ట్ పెట్ట‌డం.. స‌మంత‌కు గాయాలైపోయాయి.. అంటూ మీడియా క‌వ‌రేజ్ చేయ‌డం.. ఇదంతా అతి అనిపిస్తోంది. సాధార‌ణంగా యాక్ష‌న్ సీన్లు చేసేట‌ప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు త‌లెత్త‌డం చాలా స‌హ‌జం. ఆ మాట‌కొస్తే.. ప్ర‌తీ యాక్ష‌న్ సీన్‌లోనూ.. హీరోలు ఏదో రూపంలో గాయ‌ప‌డుతూనే ఉంటారు. దాంతో పోలిస్తే స‌మంత చేతికి అయిన గాయం న‌థింగ్. ఈమాత్రం దానికే స‌మంత పోస్ట్ చేయ‌డం.. దాన్ని మీడియా విప‌రీత‌మైన క‌వ‌రేజ్ ఇవ్వ‌డం విడ్డూరంగా అనిపిస్తోంది.

 

స‌మంత‌కు అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి. ఈ విష‌యం తానే చెప్పింది. అయినా స‌రే... ధైర్యం చేసి యాక్ష‌న్ నేప‌థ్య‌మున్న క‌థ‌ల్ని ఎంచుకొంటోంది. ఓర‌కంగా ఇది సాహ‌స‌మ‌నే చెప్పాలి. ఇప్పుడున్న అనారోగ్య ప‌రిస్థితుల్లో స‌మంత త్వ‌ర‌గా అల‌సిపోతుంది. అలాంట‌ప్పుడు యాక్ష‌న్ ఫీట్లు ఎందుకు చేస్తోందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. మ‌రోవైపు.. `ఖుషి` షూటింగ్ ఇంకా మొద‌లు కావాల్సివుంది. ఈ సినిమా స‌మంత వ‌ల్లే ఆగిపోయింది. ఎప్పుడో ఒప్పుకొన్న `ఖుషి`ని పూర్తి చేయ‌కుండా ఆ త‌ర‌వాత మొద‌లెట్టిన వెబ్ సిరీస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతోందో.. ఖుషి బృందానికి సైతం అర్థం కావ‌డం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS