అక్కినేని 'హలో' కొంచెం కొత్తగా

మరిన్ని వార్తలు

అఖిల్‌ కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్‌ కోసం నాగార్జున ముందుగానే కొన్ని క్లూస్‌ ఇచ్చాడు. 'హలో గురూ.. ప్రేమ కోసమేరా జీవితం..' అనే పాటని క్లూగా ఇచ్చాడు. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య జంటగా తెరకెక్కిన 'ఏ మాయ చేశావె' చిత్రంలోని 'హలో..' అంటూ సాగే పాటని క్లూగా ఇచ్చాడు. దాంతో 'హలో' అనే టైటిల్‌ కావచ్చని అభిమానులు ఊహించారు. అదే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ టైటిల్‌ని సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తూ నాగార్జున ఓ స్పెషల్‌ వీడియోని కూడా రిలీజ్‌ చేశాడు. స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోలు, హీరోయిన్లు 'హలో' చెప్తూ ఉన్నట్లుగా ఉన్న ఈ వీడియో భలే ఎట్రాక్ట్‌ చేస్తోంది. విక్టరీ వెంకటేష్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, రానా, నాని, ప్రబాస్‌, సమంత తదితరులు 'హలో' అంటూ పలకరించారు. నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు (పాత సినిమాలోని వీడియో బైట్‌ ) 'హలో' చెబుతూ అక్కినేని అభిమానుల్ని అలరించారు. ఆ తర్వాత ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ వచ్చింది. ఆ వెంటనే ఇంకో స్టిల్‌ ప్రత్యక్షమైంది. ఆ స్టిల్‌లో ఎత్తైన భవనం మీద తలక్రిందులుగా రెండు చేతులపై అఖిల్‌ నిలబడ్డాడు. ఈ స్టిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్‌లుక్‌ స్టిల్‌ కూడా చాలా ఇన్నోవేటివ్‌గా క్రియేట్‌ చేశాడు. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ లుక్‌లో ఉంది ఆ లుక్‌. విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్‌కి జంటగా కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS