పైరసీ అనేది ఒక తెలుగు ఇండస్ట్రీ నే కాదు. ప్రపంచంలోని అన్ని ఇండస్ట్రీలకి ఇది ఒక శాపంగా మారింది. పైరసీ వల్ల సినిమా చచ్చిపోతుందని చాలామంది గగ్గోలు పెడుతున్నా ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని చూసే వారు ఏమాత్రం తగ్గలేదు. ఇది బయటవాళ్లే కాకుండా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కూడా ఈపని చేస్తుండటం గమనార్హం. ఇక ఇది తమిళ ఇండస్ట్రీలో అయితే మరీ దారుణం.
అక్కడ లోకల్ సినిమాల పైరసీ వెర్షన్ చూసే వాళ్ళకు కొదవే ఉండదు. ఏ సినిమా టోరెంట్ ఏ వెబ్ సైట్ లో దొరుకుతుందో అక్కడవాళ్లకి బాగా తెలుసు. ఇండస్ట్రీ వాళ్ళ వల్లే ఇలాంటి పనులు జరుగుతున్నాయని, వారే తమిళ సినిమాని దయనీయస్థితికి చేరుస్తున్నారని విశాల్ వంటి వారు ఆరోపిస్తూ వుంటారు. విశాల్ పైరసీ పై ఇంతకముందు కూడా చాలాసార్లు మాట్లాడాడు. దీనికి తోడు విశాల్ ప్రేయసి వరలక్ష్మి కూడా ముందుకు వచ్చింది.
ఓ సినిమా షూటింగ్ లో ఉన్న వరలక్ష్మి సీన్ ముగించుకుని కారా వాన్ లోకి వెళ్తే అక్కడే ఉన్న ఆమె డ్రైవర్ తమిళ కొత్త సినిమా 'VIP - 2' తమిళ వెర్షన్ చూస్తూ కనిపించాడు. దాంతో ఆమె అతడి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇండస్ట్రీ లో వాళ్ళే ఇలా చేస్తే, ఇక పైరసీ ని ఎవరు కాపాడతారని ఆమె ప్రశ్నించింది. దయచేసి పైరసీ ని ప్రోత్సహించి ఇండస్ట్రీ ని నాశనం చేయవద్దని అభిమానులకి విజ్ఞప్తి చేసింది.