అక్కినేని అఖిల్‌ ఖాతాలో ఇంకొకటా?

మరిన్ని వార్తలు

అంచనాలు భారీగా ఉన్నా, వరుస ఫెయిల్యూర్స్‌తో అక్కినేని అందగాడు అఖిల్‌ హీరోగా తన స్టామినా చూపించడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. మొదటి సినిమాతో పూర్తిగా నిరాశపరిచిన అఖిల్‌, రెండో సినిమా 'హలో'తో ఫర్వాలేదనిపించాడు. మూడో సినిమా 'మిస్టర్‌ మజ్ను' మరోసారి నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. చాలా వరకూ షూటింగ్‌ పార్ట్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. అయితే, ఈ సినిమాలో అఖిల్‌ సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఇంతవరకూ తెలియరాలేదు. బాలీవుడ్‌ భామ గురించి ట్రై చేసి, ట్రై చేసి విసిగిపోయాడు అఖిల్‌. దాంతో ఆల్రెడీ టాలీవుడ్‌కి సుపరిచితురాలైన భామనే తీసుకోవాలని డిసైడ్‌ అయ్యాడట. ఇక్కడ కూడా అలాంటిలాంటి భామని కాదు, టాప్‌ ఛైర్‌కి దగ్గరగా ఉన్న కేటగిరి నుండే హీరోయిన్‌ని తీసుకోవాలని అఖిల్‌ అండ్‌ టీమ్‌ యోచిస్తున్నారట. సో ఆ కేటగిరిలో పూజా హెగ్దే పేరు తాజాగా తెర పైకి వచ్చింది.

 

అయితే, బిగ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న పూజా హెగ్దే, అఖిల్‌ కోసం డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకుంటుందా? చూడాలి మరి, మరో వైపు నాగార్జున, అఖిల్‌ తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న పరశురామ్‌తో నాగార్జున మంతనాలు చేస్తున్నారట. అఖిల్‌ కోసం ఓ మంచి లవ్‌ స్టోరీ సిద్ధం చేయమని సూచనలిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌తో అఖిల్‌ ఈ సారైనా హిట్టు కొడతాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS