ఈ మధ్య బ్రేకప్ ఇష్యూస్‌కి కొత్త ట్రెండ్ వచ్చింది. పీకల్లోతు ప్రేమల్లో ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో అన్యోన్యంగా ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నారు. డిఫరెన్సెస్ వచ్చాయన్నప్పుడు, ఆ ఫోటోల్ని సోషల్ మీడియా నుండి డిలీట్ చేసి, సింబాలిక్‌గా బ్రేకప్ అని తెలియజేస్తున్నారు. మొన్న విశాల్ విషయంలో ఇదే జరిగింది. హైద్రాబాద్ అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్న విశాల్ వివాహం రద్దయ్యిందనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు, ఆయనకు కాబోయే భార్య తన సోషల్ మీడియా అకౌంట్ నుండి, విశాల్‌తో కలిసి దిగిన ఫోటోల్ని ఒక్కటి కూడా లేకుండా, డిలీజ్ చేయడమే. ఇప్పుడు తాజాగా ఇలాంటి వార్తే, ఇలియానా విషయంలో వినిపిస్తోంది. ఇలియానా లండన్ కుర్రోడు ప్రొఫిషనల్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో లవ్ అంటూ తిరిగి, కొన్నాళ్లు సహజీవనం చేసి, పెళ్లి కూడా అయిపోయిందనే సంకేతాలు పంపించింది. ఈ విషయమై ఇలియానాని ఎన్నిసార్లు అడిగినా, ఒక్కసారీ స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పలేదు.
కానీ, సోషల్ మీడియాలోని ఫోటోలు, మెసేజ్‌లతోనే ఫ్యాన్స్‌ని నచ్చినట్లు అర్ధం చేసుకోండన్నట్లుగా సంకేతాలిచ్చింది. సరే ఆ విషయం పక్కన పెడితే, తాజాగా ఇలియానా, విచ్చలవిడిగా ఆండ్రూతో కలిసి దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసేసింది. దానికి కారణం వీరిద్దరి బ్రేకప్‌నే అని ఫ్యాన్స్ ఓ క్లారిటీకి వచ్చేశారు. మరి, నిజంగానే ఇలియానా, ఆండ్రూ విడిపోయారా.? వీరిద్దరి రిలేషన్‌షిప్ విషయంలోనే ఎప్పుడూ ఇలియానా క్లారిటీ ఇవ్వలేదు. అలాంటిది బ్రేకప్ విషయంలో క్లారిటీ ఇస్తుందా.? నో ఛాన్స్.. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ.