అక్కినేని రాకుమారుడు అఖిల్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత గ్యాప్ తీసుకున్నా, ఫెయిల్యూర్స్ అఖిల్‌ని వదిలిపెట్టడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలతోనూ ఆకట్టుకోలేకపోయాడు అఖిల్. ఇక ఇప్పుడు నాలుగో సినిమాతో రాబోతున్నాడు. అఖిల్ దెబ్బకి వినాయక్, విక్రమ్ కుమార్లాంటి డైరెక్టర్లు కూడా ఫ్లాప్స్ చవి చూడక తప్పలేదు. అన్నీ ఆలోచించి ఈ సారి బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమా ఓకే చేశాడు అఖిల్. 'బొమ్మరిల్లు' సినిమా యూత్‌లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో, బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక అఖిల్‌కి హిట్ ఇవ్వాల్సిన అతి పెద్ద బాధ్య ఇప్పుడు ఆ బొమ్మరిల్లు భాస్కర్‌పై పడింది.
ఎలాగైనా అఖిల్‌ని గట్టు మీద పడేయాలనే కసితో ఉన్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈయన. అఖిల్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టు ప్రిపేర్ చేశాడు. స్క్రిప్టుపై నాగార్జున చాలా నమ్మకంతో ఉన్నారట. ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. గీతా ఆర్స్ట్ 2 బ్యానర్‌తో కలిసి బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరోయిన్గా కొత్త భామని పరిశీలిస్తున్నారట. త్వరలోనే హీరోయిన్ పేరు కన్ఫామ్ చేయనున్నారనీ తెలుస్తోంది.