అన్నయ్య భార్యని వదిన అనే కదా పిలవాలి! అందుకే అక్కినేని అఖిల్ తన అన్నయ్య నాగచైతన్యకు కాబోయే భార్య అయిన సమంతని ఉద్దేశించి 'వదిన' అని సంబోదించాడు. చిన్న ఎక్స్‌ప్రెషన్ అయినా 'థాంక్యూ వదినా' అని అఖిల్, సమంతని ట్విట్టర్‌లో సంబోదించడంతో అక్కినేని అభిమానులు స్వీట్ షాక్‌కి గురయ్యారు. ట్విట్టర్‌లో అఖిల్‌కి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫీట్ సాధించిన నేపథ్యంలో వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు అఖిల్. 'వాళ్ళందరూ నా ఫాలోవర్స్ కాదు, నా బిలీవర్స్' అని అఖిల్ పేర్కొనడంతో, సమంత 'నేను కూడా బిలీవర్‌నే' అని పేర్కొంది. వదిన అలా అనడంతో, ఆమెకు 'థ్యాంకూ వదినా' అంటూ కృతజ్ఞతలు తెలిపాడు అఖిల్. త్వరలో నాగచైతన్య, సమంత పెళ్ళి పీటలెక్కనున్నారు. త్వరలో అఖిల్ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టైటిల్ 'జున్ను' అని ప్రచారం జరుగుతోంది. స్వీట్ టైటిల్‌తో అఖిల్ త్వరలో మన ముందుకు రాబోతున్నాడన్న మాట. అన్నట్లు విక్రమ్ డైరెక్షన్‌లో రూపొందిన 'మనం' సినిమాలో అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా నటించింది. మరో పక్క సమంత తాజాగా చరణ్ సినిమాలో నటిస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో, చరణ్‌కి తొలిసారిగా జంటగా నటిస్తోంది. చైతూ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.