'మ‌నం' మ్యాజిక్ రిపీట్ అవ్వ‌బోతోందా?

మరిన్ని వార్తలు

అక్కినేని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేని చిత్రం 'మ‌నం'. అక్కినేని ఫ్యామిలీ కూడా... ఈ సినిమాని త‌రచూ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఒక కుటుంబానికి చెందిన మూడు త‌రాల న‌టులు ఒకే సినిమాలో క‌ల‌సి ప‌నిచేయ‌డం చాలా అరుదైన విష‌యం. అందులోనూ ఆ సినిమా అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి చివ‌రి చిత్రం కావ‌డం కూడా చ‌రిత్ర‌లో ఈ సినిమాని మిగిలిపోయేలా చేసింది. ఇప్పుడు 'మ‌నం'లాంటి మ‌రో సినిమా అక్కినేని కుటుంబం నుంచి రాబోతోంద‌ట‌. అదే.. 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్‌గా `బంగార్రాజు` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు, నాగ చైత‌న్య కూడా న‌టిస్తున్నాడు.

 

ఇప్పుడు ఈ టీమ్‌లో స‌మంత కూడా చేరింద‌ట‌. చైతూ ప‌క్క‌న క‌థానాయిక‌గా స‌మంత క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. 'మ‌నం'లోనూ స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికి స‌మంత అక్కినేని కోడ‌లు కాదు. ఇప్పుడు కోడ‌లు హోదాలో న‌టించ‌బోతోంది. అఖిల్ కూడా క‌లిస్తే ఇది మ‌రో 'మ‌నం' అవ్వ‌డంఖాయం. అఖిల్ లేక‌పోయినా 'మ‌నం' మ్యాజిక్ ఈ సినిమాతో రిపీట్ అవుతుందేమో అనిపిస్తోంది. అదే జ‌రిగితే అక్కినేని అభిమానులు ఈ సినిమాని కూడా ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. ప్ర‌స్తుతం 'మ‌న్మ‌థుడు 2' సినిమాతో బిజీగా ఉన్నాడు నాగ్‌. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే 'బంగార్రాజు' సెట్స్‌పైకి వెళ్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS