ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని సోషల్ మీడియాలో నాగార్జున అప్పీల్ చేస్తున్నారు. నాగార్జున అప్పీల్‌కి ఫ్యాన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. ఓటు అప్పీల్ చేస్తున్న మీ ఓటు ఏ పార్టీకి అని అడుగుతున్నారు. మరికొంతమంది టీఆర్‌ఎస్‌కి ఓటెయ్యమనీ, టీడీపీకి మద్దతివ్వండి అని ఇంకొందరు అడుగుతున్నారు. గతంలో నాగార్జున టీడీపీ తరపున జన్మభూమికి ప్రచారం చేశారు.
ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీకి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు నాగార్జున మద్దతు ఎవరికి అంటే క్లారిటీ లేదు కానీ, అభిమానులు మా పార్టీకి మద్దతివ్వండి అంటే, మా పార్టీకి మద్దతివ్వండి అంటూ నాగార్జునను అడుగుతున్నారు. మరోపక్క కొందరు యాంటీ అభిమానులు నాగార్జునను ట్రాలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జునకు అత్యంత సన్నిహితుడు, తోటి స్టార్ హీరో అయిన బాలకృష్ణ టీడీపీ తరపున విసృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్‌లో 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. హిందీతో పాటు, తెలుగులో కూడా త్వరలో విడుదల కానుందీ సినిమా. నానితో నాగార్జున నటించిన మల్టీస్టారర్ 'దేవదాస్' మూవీ ఓ మోస్తరు విజయం అందుకుంది. ఆ తర్వాత నాగార్జున తన కొత్త సినిమా గురించి డీటెయిల్స్ ఇచ్చింది లేదు కానీ, జనవరిలో కొత్త విషయం చెబుతానని ప్రకటించారు. ఆ కొత్త విషయం ఆయన తదుపరి సినిమా సంగతే కావచ్చు.