'రంగస్థలం'తో రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు రామ్‌చరణ్. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో తనని ఊరిస్తున్న మిలియన్ డాలర్ల మైలురాయిని అవలీలగా చేరుకున్నాడు. 'రంగస్థలం' ఓవర్సీస్‌లో 3.5 మిలియన్ డాలర్లని సంపాదించింది. ఇది నాన్ బాహుబలి రికార్డ్! ఓవర్సీస్‌లో అంతంతమాత్రంగానే ఉన్న చరణ్ రికార్డు... 'రంగస్థలం'తో బాగా మెరుగుపడింది. 'వినయ విధేయ రామా'తో ఆ రికార్డుని కాపాడుకోవడం చరణ్ ముందున్న భారీ లక్ష్యం.
బోయపాటి సినిమాల ఫార్ములా తెలియంది కాదు. ఆయన సినిమాల్లో యాక్షన్‌దే పెద్దపీట. ఎమోషనల్ డైలాగులు, హీరోయిజం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు బీ, సీలలో బాగా ఆడతాయి. కానీ ఓవర్సీస్‌లో మాత్రం ఎక్కవు. బోయపాటి సినిమాలన్నీ ఓవర్సీస్ లో యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి. ఆఖరికి 'సరైనోడు' కూడా అక్కడ దుమ్ము దులపలేకపోయింది. ఇప్పుడు 'వినయ విధేయ రామా' ఏం చేస్తాడా? అని ఆసక్తితో ఎదురుచూస్తోంది ట్రేడ్ మీడియా. 'రంగస్థలం' మ్యాజిక్‌ని 'వినయ విధేయ రామా' రిపీట్ చేయడం చాలా కష్టం.
కాకపోతే.. ఇది సంక్రాంతి సినిమా. దానికి తోడు.. 'మా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్నాయి' అంటూ... కాస్త మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి. అందుకే ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ.. అవి ఎంత వరకూ నిలబడతాయన్నది ప్రశ్నార్థకం. 'రంగస్థలం' రికార్డు తిరగరాయకపోయినా ఫర్వాలేదు గానీ.. కనీసం 1 మిలియన్ మార్క్ చేరితే చాలు.. అని భావిస్తున్నాడు చరణ్. ఏం జరుగుతుందో చూడాలి.