అక్కినేని హీరోయిన్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు.!

మరిన్ని వార్తలు

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మొట్ట మొదటి ఏకైక హీరోయిన్‌ సుప్రియ. అప్పుడెప్పుడో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత సుప్రియ మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. 

కానీ సినిమాలతో పరోక్షంగా సంబంధం ఉంది సుప్రియకు. తెరపై కనిపించకపోయినా, తెర వెనుక అన్నపూర్ణ స్టూడియోస్‌కి సంబంధించిన అన్ని పనులూ ఆమె చూసుకుంటోంది. అంతేకాదు, నాగార్జున నటించిన చాలా చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించింది సుప్రియ. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు సుప్రియ మళ్లీ తెరపై కనిపించింది. 

అడవిశేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'గూఢచారి' సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయం లేటెస్టుగా విడుదలైన టీజర్‌ ద్వారానే తెలిసింది. టీజర్‌లో పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో సుప్రియ కనిపించింది. దాంతో సుప్రియ రీ ఎంట్రీ గురించి అందరికీ తెలిసింది. టీజర్‌లో చూపించిన విధానాన్ని బట్టి సుప్రియకు ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్లుగా అనిపిస్తోంది. 

అయితే ఇకపై సుప్రియ నటిగా కంటిన్యూ అవుతుందా? లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS