కన్నడ భామ అక్షర గౌడ, తెలుగులోనూ ఓ సినిమా చేసింది. అయితే, ఆ సినిమా కాస్తా ఆమెకు చేదు ఫలితాన్ని ఇచ్చంది. ఆ సినిమా ఏంటో తెలుసా.? కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మధుడు-2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం విదితమే. అక్షర గౌడ విషయానికొస్తే, అటు మోడలింగ్.. ఇటు సినిమాలతో ఈ బ్యూటీ యమా బిజీగా వుందండోయ్.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోల్డంతమంది ఫాలోవర్స్ వున్నారు. ఎందుకు వుండరు? ఇలాంటి హాట్ హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంటే. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘బ్రా’బోయ్ అనేలా అందాల్ని ఆరబోసేస్తోన్న ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్ అయ్యేంత సీన్ వున్నా, ఎందుకో లక్కు కలిసి రావడంలేదంటే. ముంబై భామలకు ఏమాత్రం తీసినపోని స్థాయిలో హాట్ అప్పీల్ మాత్రమే కాదు, స్టయిల్ కూడా వుందీ భామకి.