కమల్‌హాసన్ కుమార్తె అక్షరహాసన్ మతం మార్చుకుందిట. బౌద్ధమతంలోకి మారానని చెప్పుకుంది. నాన్‌వెజ్ తింటే మాత్రం ఎముకలు మెడలో వేసుకుని తిరగం కదా! మతం మార్చుకన్న విషయాన్ని ఇలా పబ్లిసిటీ చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో ఎందుకిలా పబ్లిసిటీ స్టంట్స్ చేసిందో ఆ ముద్దుగుమ్మకే తెలియాలి. సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతోనే పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందేమో ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. తమిళంలో ప్రస్తుతం 'వివేగం' సినిమాలో నటిస్తోంది అక్షర. అజిత్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా మరో పక్క తండ్రి కమల్ హాసన్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అలాగే ఈ మధ్య అక్క శృతిహాసన్ చుట్టూ కూడా పలు వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ చాలక, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కూడా తండ్రి, అక్క దారుల్లోనే నడవాలంటూ లేని పోని వివాదాల్లో కాలు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెర వెనుక పని చేసిన అనుభవం అక్షరకు ఉంది. ఇప్పుడు తెరపై నటిగా కెమెరా ముందు ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటోంది. అలాగే బౌధ్ద మతంలో చేరి ఆ మతం గురించి, ఆ ఆచార వ్యవహారాల్ని గురించి తెలుసుకోవాలని అక్షర భావిస్తోందట. బౌద్ధ మతంలోని జీవన విధానం అక్షరను ఎంతగానో ఆకర్షించిదట. అదే తాను ఈ మతంలోకి రావడానికి ప్రోత్సహించిందంటోంది ముద్దుగుమ్మ అక్షరా హాసన్. జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి సాహసాలు చేయాలి. అప్పుడే లైఫ్‌లో కిక్ ఉంటుందంటోంది అక్షర.