కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెల్సిందే. ఆమె తన ఫోన్ ద్వారా, రహస్యంగా తీసుకున్న ఆ ఫొటోలు సోషల్ మీడియాకి ఎలా ఎక్కాయో ఎవరికీ అర్థం కావడంలేదు.
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఈ సరికొత్త స్మార్ట్ ప్రపంచంలో ప్రైవేటు జీవితాలు రోడ్డున పడిపోవడం పెద్ద విషయమేమీ కాదు. సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వుండాలి, వుంటున్నారు కూడా. మరి, అక్షర హాసన్ ఫోన్ నుంచి ఆ ఫొటోలు ఎలా బయటకు వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానంగా కొందరు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ బహుశా ఆమె ఫోన్‌ని ఎవరైనా హ్యాక్ చేసి వుండొచ్చని చెబుతున్నారు. అలా ఎవరు చేశారన్నది ఇంకో ప్రశ్న.
ఈ అంశంపై తాజాగా అక్షర హాసన్ స్పందించిందట. ఆ ఫొటోలు తనవేనని ఒప్పుకుందట. తన ఫొటోల్ని లీక్ చేసినవారిని వదిలి పెట్టేదే లేదని చెబుతోందట. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో తేలిపోతుంది. దొంగలెవరన్నదీ స్పష్టమైపోతుంది. గతంలో రాధికా ఆప్టే ఫొటోలు కూడా ఇలాగే బయటకొచ్చాయి. మరికొందరు హీరోయిన్లకూ ఈ ముప్పు తప్పలేదు. అయితే చాలావరకు ఇలాంటివి మార్ఫింగ్ ఫొటోలే అవుతుంటాయి.
అక్షర విషయంలో మార్ఫింగ్ జరిగిందా? నిజమేనా? అనేదానిపై స్పష్టత కొరవడుతోంది. అక్షర స్పందించిందే నిజమైతే, అవి ఖచ్చితంగా ఆమె ఫొటోలే అయి వుండాలి.
#Aksharahassan pic.twitter.com/hobJVA2hxE
— Caroline (@CarolineChennai) 3 November 2018