టాప్‌ గేర్‌లో మిల్కీ బ్యూటీ!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోందా? అవుననే చెప్పాలి. అనూహ్యంగా తమన్నా కెరీర్‌లో వేగం పెరిగింది. వరుస సినిమాలు చేసేస్తోందిప్పుడు తమన్నా. 'క్వీన్‌' తెలుగు రీమేక్‌, 'అభినేత్రి' సీక్వెల్‌, 'ఎఫ్‌2', 'సైరా నరసింహారెడ్డి' సినిమాలతో ఓ పక్క బిజీగా వుంటూనే, మరో పక్క వరుస సినిమాలకు కమిట్‌ అవుతోంది. 

తాజాగా తమన్నా చేతిలో మరో ప్రాజెక్ట్‌ వచ్చిపడింది. ఆ సినిమా పేరు 'నెక్స్‌ ఏంటీ' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నవదీప్‌, సందీప్‌ కిషన్‌ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్‌. ఇవే కాదు, మరికొన్ని సినిమాలు కూడా తమన్నా ఖాతాలో వున్నాయట. వాటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇంత స్పీడ్‌ ఏంటి.? అని ప్రశ్నిస్తే, ఒక్కోసారి కెరీర్‌లో 'స్లో పేస్‌' వుంటుంది, ఒక్కోసారి కెరీర్‌లో వేగం పెరుగుతుంది.. ఇప్పుడు టాప్‌ గేర్‌లో కెరీర్‌ దూసుకుపోతోంది అని తమన్నా చెబుతోంది. 

ఈ మధ్యనే తమన్నా, 'నా నువ్వే' సినిమాలో నటించింది. అది కాస్తా ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. జయాపజయాలు ఎవరికైనా సహజమే. ఫ్లాపులొచ్చినప్పుడు బౌన్స్‌ బ్యాక్‌ అవడమెలాగో తెలియడం కూడా గొప్పతనమే. తమన్నా, ఇప్పుడు తన కెరీర్‌ని మళ్ళీ జాగ్రత్తగా బిల్డప్‌ చేసుకుంటోంది. ఏజ్‌ పెరుగుతున్నా తమన్నా గ్లామర్‌ కూడా పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు. 

సో, యంగ్‌ హీరోల సరసన సైతం తమన్నా హీరోయిన్‌గా పెర్‌ఫెక్ట్‌గా సూటయిపోతుంది. అందుకే, తమన్నా కెరీర్‌లో ఈ జోరుఉ.. అనుకోవచ్చేమో.! ఇదిలా వుంటే 'నెక్స్‌ట్‌ ఏంటీ' సినిమాకి బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వం వహిస్తుండడం గమనార్హం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS