రోబో 2.ఓ కథకే ప్రాణం లాంటి పాత్ర పక్షిరాజు. ఈ పాత్రే విధ్వసం సృష్టిస్తుంది.. ఈ పాత్రే మనసుని హత్తుకుంటుంది కూడా. ఒక విధంగా హీరోలాంటి విలన్ పాత్ర అది. ఈ పాత్రలో అక్షయ్ కుమార్ నటన అందరికీ బాగా నచ్చుతోంది. నిజానికి ఈ పాత్ర కల్పితం కాదు. నిజంగానే పక్షుల్ని అంతగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు కూడా. `బర్డ్ మేన్ ఆఫ్ ఇండియా`గా పిలవబడే ఆ వ్యక్తే... సలీం అలీ.
పక్షుల కోసం, వాటి ఉనికి కోసం శ్రమిస్తూ.. ఎన్నో ఉద్యమాలు చేసిన పక్షి ప్రేమికుడు,పర్యావరణ వేత్త. రాజస్థాన్ లోని భరత్ పురాలో పక్షుల కోసం ఓ అభయారణ్యాన్ని నెలకొల్పారు. ఇది దేశంలోనే తొలి అభయారణ్యంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఫ్లాష్ బ్యాక్‌లో మనం చూస్తున్న అక్షయ్ కుమార్ గెటప్ కూడా సలీం అలీ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నదే. ఆ తెల్ల గడ్డం, కళ్లజోడు, స్వెట్టర్... నిజ జీవితంలో సలీం అలానే ఉండేవారు. సలీం సేవలకు గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. తన జీవితాన్ని పక్షుల కోసం త్యాగం చేసిన ఈ పక్షిరాజు.. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయం చేసిన శంకర్.. ఆస్ఫూర్తితోనే అక్షయ్ పాత్రని రూపొందించాడు.