బన్నీ - త్రివిక్రమ్‌ ఇంకోటి వదిలారండోయ్‌.!

మరిన్ని వార్తలు

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో..' ప్రమోషన్స్‌ అన్నీ ప్లెజెంట్‌గా సాగుతున్నాయి. మొదట్నుంచీ ఒకే ర్యాపో మెయింటైన్‌ చేస్తున్నారు 'అల..' టీమ్‌ ప్రమోషన్స్‌లో. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వెరీ లేటెస్ట్‌గా మరో ప్రోమో రిలీజ్‌ చేశారు. ఆన్‌ సెట్స్‌ మేకింగ్‌ వీడియో ఇది. టీమ్‌ మొత్తం చాలా సరదా సరదాగా కనిపిస్తున్నారు ఈ వీడియోలో. బన్నీ భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్‌, అర్హలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ ఛైర్‌లో కూర్చొని నేను ప్రొడ్యూసర్‌ని అంటూ చిన్నారి అయాన్‌ సందడి చేయడం ఈ వీడియోకి హైలైట్‌గా నిలిచింది.

ఇప్పుడీ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో బన్నీ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి టబు కీలక పాత్ర పోషిస్తోంది. మురళీ శర్మ, నవదీప్‌, సుశాంత్‌, జయరాం, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS