అల వైకుంఠ‌పుర‌ములో.. ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ సూప‌ర్‌

మరిన్ని వార్తలు

ఈరోజుల్లో సినిమాని ప్ర‌చారం చేసుకోవ‌డం చాలా ముఖ్య‌మైన విష‌యం. పెద్ద సినిమా క‌దా, స్టార్లు ఉన్నారు క‌దా.. అనే అల‌స‌త్వం అస్స‌లు ప‌నిచేయ‌దు. చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలి. ఎంత పెద్ద సినిమా అయినా, భారీ ప‌బ్లిసిటీ చేసుకోవాలి. అల వైకుంఠ‌పురములో ఈ రూల్ బాగా ఫాలో అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించిన రెండు పాట‌లు వ‌చ్చేశాయి. ఓ టీజ‌ర్‌నీ విడుద‌ల చేశారు. సినిమా విడుద‌ల‌కు దాదాపు రెండున్న‌ర నెల‌ల గ్యాప్ ఉంది. అయినా స‌రే ప‌బ్లిసిటీ శంఖం ఎప్పుడో ఊదేశారు. పాట‌లు విడుద‌ల చేసే టైమింగ్,. వాళ్ల స్ట్రాట‌జీ చాలా బాగుంది. సాధార‌ణంగా లిరిక‌ల్ వీడియోస్ విడుద‌ల చేస్తుంటారు.

 

అయితే ఈసారి దానికి గాయ‌నీ గాయ‌కుల హంగామా తోడైంది. మ్యూజిక్ కంపోజీష‌న్ గ్యాంగ్ కూడా క‌నిపిస్తోంది. మధ్య‌మ‌ధ్య‌లో మూవీ క్లిప్పింగ్స్ వాడేస్తున్నారు. దాంతో ఆయా పాట‌ల‌కు మంచి క్రేజ్ వ‌స్తోంది. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` పాట కూడా ఇలానే విడుద‌ల చేశారు. ఈ పాట‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ సెట్‌ని రూపొందించారు. అక్క‌డే.. వీడియో షూట్ చేసి, ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు.

 

ఆడియో విడుద‌ల చేయ‌డంలో ఇదో స‌రికొత్త ట్రెండ్‌. గాయ‌నీ గాయ‌కులు పాడుతుంటే, త‌మ‌న్ పియానో వాయిస్తోంటే, లైవ్ ఆర్కెస్ట్రా ఎదురుగా ఉంటుందే, మ‌ధ్య‌లో బ‌న్నీ స్టెప్పులు చూస్తుంటే... నిజంగా సినిమాలో పాట చూసినంత అనుభూతి క‌లుగుతోంది. మున్ముందూ ఇదే ట్రెండ్ కొన‌సాగుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS