ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. మహేష్‌బాబు, రజనీకాంత్ సినిమాలతో 'అల..'కి గట్టి పోటీ ఉంది. అందుకే ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు వచ్చేశాయి. కానీ టీజర్‌మాత్రం బయటకు రాలేదు. 'అల..' టీజర్ ఆలస్యం అవ్వడానికి ఓ ప్రధాన కారణం ఉందట. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కట్ చేశారని, అయితే... ఆ టీజర్ బన్నీకి నచ్చలేదని తెలుస్తోంది. టీజర్ మరో వెర్షన్ కట్ చేయించమని త్రివిక్రమ్ ని అడిగాడట.
టీజర్ విషయంలో ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్ తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. `సరిలేరు నీకెవ్వరు` టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల్నీ ఆకట్టుకుంది. నాన్ మహేష్ ఫ్యాన్స్ సైతం టీజర్ చూశాక.. `హిట్ అవుతుంది` అనే నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నారు. యూ ట్యూబ్‌లో టీజర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దానికి ధీటుగా `అల..` టీజర్ ఉండాలన్నది బన్నీ పట్టు. అందుకే టీజర్ విషయంలో ఇంతలా ఆలోచిస్తున్నాడు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.