ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది `అల.. వైకుంఠపురములో`. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రంలోని రెండు గీతాలు విడుదలయ్యాయి. `సామజవరగమన` క్లాస్‌ని ఆకట్టుకుంటే, `రాములో రాములా` మాస్‌ని పట్టేసింది. మరో పాటని త్వరలో విడుదల చేయబోతోంది.
అయితే ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్ సాంగ్ కూడా ఉందట. ఓ జానపద గీతాన్ని బిట్ సాంగ్‌గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాలోని కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందట. శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో బాగా వినిపించే ఈ గీతం.. తెరపై కనిపించనున్నదని తెలుస్తోంది.
సాధారణంగా శ్రీకాకుళం జానపదాలంటే పవన్ కల్యాణ్‌కి చాలా ఇష్టం. తన సినిమాల్లో తరచూ ఆ పాటల్ని వినిపిస్తుంటారు. అయితే ఈసారి బన్నీ ఆ బాధ్యత తీసుకున్నాడన్నమాట. మరి ఆ పాట ఏ స్థాయిలో హల్ చల్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.