బన్నీ సర్‌ప్రైజ్‌ ఎప్పుడంటే!

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'కి సంబంధించి ఓ తాజా అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ విడుదల చేయనున్నారనేది ఆ అప్‌డేట్‌. అందుకు సంకేతంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్టిల్‌ని రిలీజ్‌ చేస్తూ, సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. అయితే, ఆ ప్రమోషనల్‌ సాంగ్‌ వీడియో దసరాకి వస్తుందా.? లేక అంతకన్నా ముందే వస్తుందా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

 

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం కూడా. ప్రజెంట్‌ ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎంతో ఇంపార్టెంట్‌. సో ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ అప్‌డేట్‌నీ సరికొత్తగా డిజైన్‌ చేయాలనుకుంటున్నారట. ఆ క్రమంలోనే ప్రమోషనల్‌ సాంగ్‌ వీడియో లాంఛింగ్‌ యోచన చేస్తున్నారట. ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. మామూలుగానే తమన్‌, బన్నీ కాంబినేషన్‌లో ఆడియో అంటే, టాపు లేచిపోతుంది. ఇక ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్న ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ రచ్చ రచ్చ చేసేలా ఉంటుందనడం అతిశయోక్తి కాదేమో.

 

ఇటీవల మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌తో కలిసి 'గ్యాంగ్‌లీడర్‌' సినిమా కోసం నేచురల్‌ స్టార్‌ నాని వేసిన స్టెప్పులకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ సాంగ్‌తో సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది కూడా. అలాగే తాజాగా తమన్‌, బన్నీ కలిసి చేయబోయే ప్రమోషనల్‌ సాంగ్‌ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. ఇక ఈ ప్రమోషనల్‌ సాంగ్‌లో తమన్‌, బన్నీ ఇద్దరూ చిందేస్తారా.? లేక బన్నీతోనే తమన్‌ ఈ సాంగ్‌ కంపోజ్‌ చేయనున్నాడా అనేది వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS