మీర్జా పూర్ స్టార్ తో సామ్

మరిన్ని వార్తలు

మయాసైటీస్ కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సామ్ రీఎంట్రీకి సిద్ధం అయ్యింది. కానీ సామ్ రీ ఎంట్రీలో వెబ్ సిరీస్ లకే ప్రాధాన్యత ఇస్తోంది. ఫామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న సామ్ అదే నిర్మాతలతో పలు వెబ్ సిరీస్ లకి కమిట్ అవుతోంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీటా డెల్ కి రీమేక్ వస్తున్న 'హానీ బనీ' లో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది. మళ్ళీ రాజ్ అండ్ డీకే నిర్మాణంలో ఇంకో వెబ్ సిరీస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఈ సిరీస్ కి తంబాడ్ ఫేమ్ రవి అనిల్ బర్వె తెరకెక్కిస్తున్నారు.   


మొన్నటివరకు ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ మెయిన్ లీడ్ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పాత్రలోకి మీర్జా పూర్ ఫేమ్ ఆలీ ఫైజల్ వచ్చి చేరాడు. ఆలీ ఫైజల్ ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా రాని  గుర్తింపు మీర్జా పూర్ ద్వారా వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఓటీటి లోనే తన అదృష్టం పరిక్షించుకుంటున్నాడు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సామ్, ఆలీ ఫైజల్ తో చేయటం గ్రేట్ అనే చెప్పాలి. సామ్, ఆలీ ఫైజల్ మెయిన్ లీడ్స్ అని తెలుస్తోంది. ఆలీ ఫైజల్ ఫాన్స్ ఇందుకు సంతోషంగా ఉన్నా సామ్ నిర్ణయం పట్ల ఫాన్స్ మాత్రం ఆందోళనగా ఉన్నారు. 


మీర్జా పూర్ లాంటి అడల్ట్ కంటెంట్ సిరీస్ లో నటించిన ఆలీ ఫైజల్ తో సామ్ నటిస్తే తన క్రేజ్ కూడా పడిపోతుందని, పైగా సిరీస్ లో అడ్డు అదుపు లేని బోల్డ్ సీన్స్ ఉంటాయని, ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో అలాంటి పాత్ర చేసి విమర్శలు ఎదుర్కొన్న సామ్ మళ్ళీ ఇలాంటి రాంగ్ రూట్ లో వెళ్తోందని నిరాశ చెందుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS