బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ క్యూట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. క్యూట్‌గా ఉంది కదా అని, కమర్షియల్ పాత్రల్ని మాత్రమే ఎంచుకోదు అలియా. విలక్షణ పాత్రలతోనూ మెప్పిస్తుంటుంది. ఈ క్యూట్ భామ ఇప్పుడు సౌత్ సినిమాల పైనా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఆలియా జత కడుతోంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అలియా యోగా యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, తన గ్లామర్ సీక్రెట్‌కి ప్రధాన కారణం 'యోగా' అని చెప్పుకొచ్చింది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, రోజులో కనీసం గంటపాటైనా అలియా యోగా చేస్తుందట. యోగా చేయడం వల్ల షూటింగ్స్ ఒత్తిడి నుండి చాలా రిలీఫ్ దక్కుతుందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కనిపించేందుకు యోగా తనకెంతో సహకరిస్తుందని అంటోంది.
జిమ్‌లో కష్టపడితే కేవలం శరీరం మాత్రమే నాజూగ్గా ఉంటుంది. కానీ, శరీరానికీ, మనసుకీ రెండింటికీ ఒకేసారి రీ ఫ్రెష్‌మెంట్ రావాలంటే అందుకు ఏకైక మార్గం యోగానే అని చెబుతోంది క్యూట్ బ్యూటీ అలియాభట్. ఇటీవల 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాలో గెస్ట్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర', 'సడక్ 2' సినిమాల్లో నటిస్తోంది. అలియాభట్ నటించిన 'కళంక్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.