టీవీ యాంకర్‌గా, నటుడిగా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా రకరకాల టాలెంట్స్ ప్రదర్శిస్తోన్న రఘు కుంచె వినూత్న ఆలోచన చేస్తున్నాడు. సింగింగ్ టాలెంట్‌లో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే పనిలో పడ్డాడు. సినిమాలతో ఎటువంటి సంబంధం లేకుండా టాలెంట్ ఉండీ, బయటపెట్టుకోలేని చాలా మందిని రఘు కుంచె ప్లే బ్యాక్ సింగర్స్‌గా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. వారిలో కొందరి లిస్టును పేరు, ఊరుతో సహా రఘు కుంచె ఇప్పటికే ప్రకటించారు.
వారే వీరు. శ్రీకాకుళం నుండి అసిరయ్యగారు. పెద్దాపురం నుండి జ్యోతి, వడిశలేరు నుండి బేబమ్మ (ఆల్రెడీ ఈ మట్టిలోని మాణిక్యాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కోటిగారు గుర్తించారు. సినిమాల్లో అవకాశాలు కల్పించారు. చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది బేబమ్మ), శంషాబాద్ నుండి రాజు, గోవిందరాజులు గారు అనంతపురం నుండి, రామశ్రీ హైద్రాబాద్ నుండి, అమెరికా నుండి నేహ, ప్రీతీ కేశవన్ తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. వీరెవరికీ సినిమాలతో ఎలాంటి సంబంధాలూ లేవు. వీరినందరినీ మ్యూజిక్ ప్రపంచంలోకి తీసుకురానున్నారు రఘు కుంచె. రఘు కుంచె చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోటి తదితర మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే చాలా మంది టాలెంటెడ్ సింగర్స్‌ని వెండితెరకు పరిచయం చేశారు. వెండితెరపై ప్రముఖ సింగర్స్‌గా పాపులర్ అయిన గీతా మాధురి తదితర సింగర్లు బుల్లితెరపై ప్రసారమయ్యే 'పాడుతా తీయగా' ప్రోగ్రాం నుండి సింగర్స్‌గా పరిచయమైనవారే. అయితే, రఘు కుంచె ప్రయత్నం పూర్తిగా విభిన్నం. ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్‌ని వెతికి పట్టుకునేందుకు ఆయన స్పెషల్‌గా ఓ టీమ్‌ని సిద్ధం చేశారనీ తెలుస్తోంది.