ఆర్.ఆర్.ఆర్ గురించిన రోజుకో వార్త. అది నిజమైనా, కాకపోయినా.. టాక్ ఆఫ్ ది టౌన్ గానే నిలుస్తుంటుంది. ఎందుకంటే.. ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ఈ సినిమాపై మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈసినిమా నుంచి కథానాయిక అలియాభట్ తప్పుకుందని, ఆమె స్థానంలో మరో నాయికని ఎంచుకునే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడన్నది ఆ వార్త సారాంశం. షూటింగులు ఇంకా మొదలవ్వకపోవడం, ఎప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో తెలియకపోవడంతో కాల్షీట్ల సమస్య వచ్చిందని, బాలీవుడ్ లో బిజీగా ఉండడం వల్ల అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి.
అయితే... అలియాభట్ ఈసినిమాలో ఉంది. తను ఎక్కడికీ పోలేదు. ఆర్.ఆర్.ఆర్ నుంచి తాను తప్పుకోలేదని, రాజమౌళి మరో కథానాయికని వెదుకుతున్నాడన్న వార్తల్లో నిజం లేదని ఇన్‌సైడ్ వర్గాల టాక్. అలియాభట్ ఇప్పటికే అడ్వాన్సు కూడా తీసేసుకుందని, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా, తాను వస్తానని మాట ఇచ్చిందని... అలాంటప్పుడు అలియాని తప్పించారు అనడంలో అర్థం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సో.. అలియా ఎక్కడికీ పోలేదన్నమాట. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనపై ఇది వరకే ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేశారు.