తెలుగునాట విజయవంతమైన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకడు. సినిమాని ఫాస్ట్‌గా తీయడంలో పూరి దిట్ట. అందుకే పాతిక సినిమాల మైలు రాయిని అతి సునాయసంగా దాటేశాడు. ఇప్పుడు ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. పూరి కలల సినిమా ఒకటుంది. ఎప్పటికైనా దాన్ని భారీ స్థాయిలో తీయాలనుకుంటున్నాడు. అదే... జగనణమన.
మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని పూరి భావించాడు. కానీ కుదర్లేదు. అయితే ఇదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని, త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కిస్తానని చెబుతున్నాడు పూరి. ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తాడని టాక్. ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తయిందట. త్వరలోనే ఓ అగ్ర హీరోకి పూరి కథ వినిపిస్తాడని టాక్. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు పూరి. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. ఆ తరవాత.. జగనణమన మొదలయ్యే అవకాశాలున్నాయి.