తెలుగు సినిమాల పరిస్థితి ఎలా తయారైందంటే, తెలుగు సినిమా అనే మాట పోయి.. పాన్ ఇండియా సినిమా అనే మాట వచ్చి చేరిపోయింది. తెలుగులో రూపొందే ప్రతీ సినిమా..పాన్ ఇండియా సినిమానే. మరీ ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అనేసరికి.. అన్ని భాషల్లోనూ విడుదల చేయడం తప్పనిసరి అయిపోయింది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ఓసినిమా రూపుదిద్దుకుంటోంది. నిజానికి ఇది పాన్ ఇండియా సినిమాగా అనుకోలేదు. `ఆర్.ఆర్.ఆర్`కి వస్తున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఈ సినిమానీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేసేశారు.
పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారడం అంత ఆషామాషీ కాదు. దానికి కొన్ని కసరత్తులు చేయాలి. ముఖ్యంగా సినిమాని స్టార్లతో నింపేయాలి. అందులో భాగంగానే ఈ సినిమాకోసం అలియాభట్ ని తీసుకొచ్చారు. కొరటాల శివ సినిమా కోసం జాన్వీ కపూర్ లాంటి పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం అలియా పేరు సూచించాడట. ఆర్.ఆర్.ఆర్‌లోనూ అలియా నటించింది. అయితే ఎన్టీఆర్ కి జోడీగా కాదు. చరణ్‌కి జోడీగా. ఆ సినిమా సమయంలో అలియాతో ఎన్టీఆర్ పరిచయం మొదలైంది. ఆ పరిచయం కొద్దీ.. ఈ సినిమాలో అలియా అయితే బాగుంటుందని ఎన్టీఆర్ భావించాడట. ఎన్టీఆర్ అడిగితే కొరటాల ఎందుకు కాదంటాడు. అందుకే అలియాని సంప్రదించారు. తాను కూడా ఓకే అనేసింది. సో.. అలా ఎన్టీఆర్ - అలియా కాంబో సెట్టయ్యింది.