పుష్పకీ భీమ్లాకీ లింకు పెట్టిన వ‌ర్మ‌... కాఫీ టైమ్ ట్వీట్ల‌తో హోరు

మరిన్ని వార్తలు

అంద‌రి దృష్టీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనే ఉంటుంది. కానీ వ‌ర్మ దృష్టి ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. ప‌వ‌న్ కి అతి పెద్ద ఫ్యాన్ నేనే అంటాడు గానీ - ఏదోలా ప‌వ‌న్‌నీ, ప‌వ‌న్ ఫ్యాన్స్‌నీ రెచ్చ‌గొట్టేలా ట్వీట్లు పెడుతుంటాడు. తాజాగా వ‌ర్మ పెట్టిన ట్వీట్లు... ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారాయి. ఈసారి ప‌వన్ ఫ్యాన్స్‌కీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కీ మ‌ధ్య పొగ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. పుష్ప‌ని భీమ్లా నాయ‌క్ తో పోలుస్తూ, పుష్ప‌లానే భీమ్లాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయాల‌ని, లేదంటే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌రువు పోతుంద‌న్న రేంజులో ట్వీట్లు వేశాడు వ‌ర్మ‌.

 

‘ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ?’ ‘ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి’.‘పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? .. పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము’.‘పవన్ కళ్యాణ్ గారూ.. గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ట్విట్ట‌ర్‌ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి’.‘అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారూ`` అంటూ వ‌రుస ట్వీట్లు పోస్ట్ చేశాడు వ‌ర్మ‌. ఓర‌కంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఇవి రెచ్చ‌గొట్టే ట్వీట్లే. మ‌రి దీనికి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS