ప్రముఖ బాలీవుడ్ కధానాయిక ఆలియా భట్ కి ప్రాణహాని ఉందని ఆమె తండ్రి మహేష్ భట్ట ముంబై పోలీసులను ఆశ్రయించడం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26న ఒక వ్యక్తి మహేష్ బట్ కి ఫోన్ చేసి తన బ్యాంక్ ఖాతాలో రూ 50లక్షలు వెంటనే జమ చేయకపోతే ఆలియా భట్, సోని రాజ్దీ (మహేష్ భట్ భార్యని) చంపేస్తానని బెదిరించాడు. అయితే ముందుగ ఇది ఆకతాయిల పని అని వదిలేసినా తరువాత కూడా ఫోన్స్ చేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించారు.
మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ పోలీసులు సమన్వయంతో యుపీ లోని సందీప్ సాహు అనే వ్యక్తిని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కేసుని ఇంత త్వరగా పరిష్కరించినందుకు మహేష్ భట్ ఇరు రాష్ట్రాల పోలీసులకు కృతజ్ఞతలు తెలియచేశారు.