గ్లామ్‌షాట్‌: అలియా 'అండర్‌ వాటర్‌' షూట్‌ అదిరిందిలే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ త్వరలో తెలుగులో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' ద్వారా ఈ బాలీవుడ్‌ శిల్పం టాలీవుడ్‌కి వస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అలియా భట్‌ తాజాగా ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. అండర్‌ వాటర్‌ ఫోటో షూట్‌ అది. పిక్‌ అయితే అద్దిరిపోయిందంతే. రేడియం గ్రీన్‌ డ్రస్‌లో దేవకన్యలా కనిపిస్తోంది.

వోగ్‌ మ్యాగజైన్‌ కోసం అలియా ఈ ఫోటో షూట్‌ చేయించుకుంది. బ్లూ కలర్‌ వాటర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో రేడియం లుక్స్‌తో మెరిసిపోతోంది. గ్లామర్‌ కూడా పీక్స్‌లో కనిపిస్తోంది ఈ పిక్‌లో. గతంలో ఈ తరహా అండర్‌ వాటర్‌ ఫోటో షూట్‌తో సెన్సేషనల్‌ అయ్యింది ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. ఆమె ఏకంగా తొమ్మిది నెలల నిండు గర్భంతో ఈ ఫీట్‌ చేసి, భళా అనిపించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS