అందాల భామ శృతిహాసన్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో శృతిహాసన్ రీ ఎంట్రీపై గాసిప్స్ వినిపిస్తున్నాయి. రవితేజ సినిమాతోనే శృతిహాసన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. వాస్తవానికి 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో శృతిహాసన్ నటించాల్సి ఉంది. అయితే, ఆ సినిమాతో ఇలియానాకి రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ఇక ఇప్పుడు శృతిహాసన్‌కి కూడా రవితేజనే రీ ఎంట్రీ ఛాన్స్ ఇవ్వనున్నాడని మళ్లీ ప్రచారం షురూ అయ్యింది. రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' చిత్రంలో నటిస్తున్నాడు.
క్రిస్మస్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీపావళి సందర్భంగా తన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు రవితేజ. 'బలుపు', 'డాన్ శీను' చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో రవితేజ 66 వ చిత్రం ఉండబోతోందని లేటెస్ట్ అప్డేట్. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్‌ని అనుకుంటున్నారట. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
సో శృతిహాసన్‌ని తాజా చిత్రం కోసం మళ్లీ తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఇది జస్ట్ గాసిప్ మాత్రమేనా.? లేక నిజమేనా.? తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. మరోవైపు శృతిహాసన్ కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న 'లాభం' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.