రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తప్పుకుందన్న వార్తలు ఈ మధ్య హల్‌చల్ చేశాయి. అయితే, చిత్ర యూనిట్ నుండి ఈ రూమర్స్‌పై ఎలాంటి స్పందనా రాలేదనుకోండి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తాజా అప్‌డేట్ ఏంటంటే, కరోనా ఉధృతి తగ్గినాక స్టార్ట్ చేయబోయే షెడ్యూల్‌లో అలియాభట్ పాల్గొననందనీ తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కి జోడీగా అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామరాజు భార్య సీత పాత్రలో ఆమె కనిపించనుంది.
ఇకపోతే, ఈ ఇద్దరి మధ్యా ఓ సాంగ్ షూటింగ్‌తో తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుందనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా వినిపిస్తోంది. అలాగే, సాంగ్‌తో పాటు అలియా సీన్స్ కూడా ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేసేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. ఇంతవరకూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి వచ్చిన అప్‌డేట్స్‌లో ‘భీమ్ ఫర్ రామ్’ వీడియో వైరల్ అయ్యింది. ఇక త్వరలోనే ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియో కూడా రానుంది. అలాగే మిగిలిన కీలక పాత్రధారులు అజయ్ దేవగణ్, సముద్రఖని, ఎన్టీఆర్ హీరోయిన్ ఒలివియా మోరిస్, ప్రతినాయక పాత్ర ధారులు రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీలకు సంబంధించిన లుక్స్‌నీ రిలీజ్ చేసే యోచనలో జక్కన్న ఉన్నాడట. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.