సినిమాల్లో హీరోయిన్లు గరిటే పట్టి, దోసెలు పోయడం, వేడి వేడిగా ఆమ్లట్స్ వేసేయడం, రకరకాల డిషెస్‌తో డైనింగ్ టేబుల్స్ నింపేసి, ఆ వంటలన్నీ నిజంగా తామే వండి వడ్డించేస్తున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చేయడం కామన్‌గా చూస్తూనే ఉంటాం. అయితే, మనకు తెలుసు.. వారికి అంత సీను లేదనీ, అదంతా ఉత్త యాక్టింగ్ అనీ. అయితే, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ బంద్.. సో నో యాక్టింగ్. ఓన్లీ రియాలిటీ. పెద్ద పెద్దవాళ్ల ఇళ్లల్లో పనివాళ్లకు పని కూడా బంద్. సో ఎంతటి వారైనా సరే తమ పని తామే చేసుకోక తప్పడం లేదు.
ఆ క్రమంలో ముఖ్యంగా హీరోయిన్ల పాట్లు చెప్పలేనివి. అయితే, లైఫ్‌లో ఎప్పుడూ ఇలాంటి ఓ రోజు వస్తుందని ఏనాడూ ఊహించని ముద్దుగుమ్ములు, మొదట్లో కాస్త కష్టంగా ఫీలయినా, సామాజిక బాధ్యతతో ఈ కరోనా హాలీడేస్‌ని ఉన్నంతలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో తాము చేస్తున్న పనీ, పాటా, పిచ్చా, పాటీ లను నెట్టింట్లో వీడియో ల రూపంలో షేర్ చేస్తూ, ఈ రకంగానూ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నారు. తమన్నా, నిధి అగర్వాల్ తదితర ముద్దుగుమ్మలయితే, కిచెన్‌లో తెగ సందడి చేసేస్తున్నారట. గరిటె తిప్పుతూ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ తయారు చేస్తున్నారట. అయితే టేస్ట్ గురించి మాత్రం అడక్కండే. ఇకపోతే, కొందరు అందా భామ లు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే వీడియోల్ని పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.