ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో అలియా భట్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలియా... ఆర్.ఆర్.ఆర్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుంచే రామ్ చరణ్, అలియాపై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
ఈ రోజు నుంచి మరో పది రోజుల పాటు అలియా.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ తోనే ఉంటుందని, ఆ తరవాత ముంబై వెళ్లనుందని సమాచారం. తొలుత ఆమెపై ఓ పాటను చిత్రీకరించబోతున్నారు.చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ యేడాది విడుదల కావల్సిన ఈ చిత్రం.. 2022 సంక్రాంతి కి వాయిదా పడింది.
ALSO SEE :
Alia Bhatt Latest Photoshoot