నాని చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. అందులో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. `టాక్సీవాలా`తో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యయిన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాలి. అయితే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లని సమాచారం. నానితో అంత బడ్జెట్ అంటే రిస్కే. నానితో సినిమా అంటే 30 కోట్లలో పూర్తి చేయాలి. అప్పుడే లాభాలొస్తాయి. కథ ఎంత బాగున్నా, మరో 20 కోట్లు రిస్క్ చేయడం అంటే కష్టమే. అందుకే ఈ సినిమా చేయాల్సిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో మరో నిర్మాత లైన్‌లోకి వచ్చాడు. ఇప్పుడు తను కూడా `ఇంత బడ్జెట్ పెట్టలేను` అని చేతులెత్తేశాడట. దాంతో ఈ సినిమాని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారని చెప్పుకుంటున్నారు. బడ్జెట్ తగ్గిస్తే.. ఈ సినిమా మొదలవుతుంది. లేదంటే అంత రిస్క్ చేయడానికి ప్రొడ్యూసర్లు సిద్ధపడాలి. ఈ రెండింటిలో ఏం జరుగుతుందో మరి.