అప్పుడే మాట మార్చేసిన అలియాభట్‌.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్యూట్‌ భామ అలియాభట్‌ టాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ఇదిగో ఈ సినిమా కోసం అలియాభట్‌ వస్తుందట. అదిగో ఆ సినిమా కోసం అలియాభట్‌ వస్తుందట.. అంటూ మాటలు చర్చకొస్తున్నాయి. కానీ ఆమె ఎంట్రీ మాత్రం షురూ కావట్లేదు. అయితే అలియాకి టాలీవుడ్‌లో మోస్ట్‌ ఫేవరేట్‌ హీరో తారక్‌ అని ఆమె చాలాసార్లు చెప్పింది. టాలీవుడ్‌లో సినిమా చేస్తే తారక్‌తోనే చేస్తానని కూడా చెప్పింది. ఎన్టీఆర్‌ నటించిన 'అరవింద సమేత..' సినిమా కోసం అలియాని తీసుకొస్తారేమో అనుకున్నారంతా. కానీ కుదరలేదు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు అలియా సింపుల్‌గా మాట మార్చేసింది. టాలీవుడ్‌ ఎంట్రీ మూవీ ఎన్టీఆర్‌తో కాదట. అల్లు అర్జున్‌తో అంటూ గాసిప్‌ స్ప్రెడ్‌ అవుతోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అలియాని ఇదే విషయమై అడిగితే అవును నిజమే అల్లు అర్జున్‌తో నటిస్తాను అని చెప్పిందట కూడా. అయితే ఆమె మాటల్లోని అంతరార్ధమేమనగా తారక్‌తోనే కాదు, బన్నీతో కూడా నటించడానికి నాకేం అభ్యంతరం లేదు.. అని మాత్రమే. అసలింతకీ టాలీవుడ్‌లో ఎంట్రీ షురూ కావాలి కదా. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు.

'భరత్‌ అనే నేను' సినిమాతో తెరంగేట్రం చేసిన కైరా అద్వానీ టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ఆఫర్స్‌ అందుకుంటూ ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే అలియాభట్‌ కూడా ఒక్కసారి అడుగుపెడితే చాలు. కలిసొచ్చిందంటే దున్నేసుకోవడమే. ప్రస్తుతం అలియా 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణ్‌వీర్‌ కపూర్‌కి జోడీగా నటిస్తోంది. అలాగే 'తఖ్త్‌', 'కళంక్‌' చిత్రాల్లోనూ అలియాభట్‌ నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS