ఆర్.ఆర్.ఆర్.. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు. అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. అలియా సోమవారం సెట్స్‌లోకి అడుగుపెట్టింది. మరో రెండు వారాల పాటు చిత్రబృందంతో పాటే ఉండనుంది. ఈ సినిమా కోసం అలియా భట్ కి భారీ పారితోషికం ఇచ్చారు నిర్మాత. అయితే.. అలియా ఖర్చు కూడా అదే రేంజులో ఉందట. అలియా బస, ఇతర సౌకర్యాల కోసం రోజుకి రెండు లక్షలు ఖర్చవుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో ఆలియా ఇటీవల పాల్గొంది. ముంబై నుంచి వస్తూ వస్తూ.. ఆమెతో పాటు పదిమంది వ్యక్తిగత సిబ్బందిని కూడా వెంటపెట్టుకొచ్చింది. ఇందులో నలుగురు బౌన్సర్లు, ఒక మేకప్ ఆర్టిస్ట్, పీఏ, హెయిర్ స్టైలిష్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, మేనేజర్, పర్సనల్ డ్రైవర్ ఉన్నారు. వీరందరికీ ఆర్ఆర్ఆర్ మేకర్స్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బస ఏర్పాటు చేశారని తెలిసింది. వీరి ఖర్చు రోజుకు రెండు లక్షలట. ఈ పదిహేను రోజుల్లో అలియా.. ఖర్చు 30 లక్షలన్నమాట. సినిమా పూర్తయ్యేసరికి కోటి తేలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముంబై హీరోయినా... మజానాకా?