హౌస్‌లో ఎంతమంది వున్నా.. ఎందరు స్టార్లు వున్నా.. వన్ అండ్ ఓన్లీ ఎంటర్‌టైనర్ అవినాష్ మాత్రమే. ఓ వైపు గ్లామర్, ఇంకో వైపు గొడవలు.. ఇవేవీ అవినాష్ ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ముందు నిలబడలేకపోయాయి. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే అవినాష్‌ని సర్‌ప్రైజింగ్‌గా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రప్పించారు బిగ్‌బాస్ నిర్వాహకులు. బిగ్‌బాస్ టీమ్ పెట్టుకున్న నమ్మకాన్ని అవినాష్ వమ్ము చేయలేదు.
ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే, ఇంకో వైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. నిజానికి, బిగ్ బాస్ టైటిల్‌ని ఈసారి గెలవగల సత్తా తనకుందని ప్రూవ్ చేసుకున్న అవినాష్‌ని, 'ఇక నీ పనైపోయింది చాలు..' అంటూ ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా పీకి పారేసింది బిగ్ బాస్ టీమ్. అబిజీత్ సహా, హౌస్‌లో వున్న మిగతా అందరు కంటెస్టెంట్స్ కంటే అవినాష్ చాలా విషయాల్లో చాలా చాలా స్ట్రాంగ్.
కానీ, అతనికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తయిపోయింది. దాంతో, ఎలిమినేషన్ తప్పలేదు. ఇక, నేటి నుంచి బిగ్‌బాస్ టెలికాస్ట్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. అవినాష్ లేడు గనుక, ఇక బిగ్‌బాస్ చూడటం కూడా అనవసరం అన్న అభిప్రాయాలు బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో కనిపిస్తున్నాయి. 'ఇంకో రెండు వారాలు.. దయచేసి బాగా ఆడండి..' అని హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్స్‌ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం ఆడతారు.? ఆడటానికి టాస్క్‌లలో సత్తా వుండాలి.. ఆడేవాళ్ళలోనూ సత్తా వుండాలి. అవి లేకనే, ఈ సారి బిగ్‌బాస్ ఇంత డల్ అయిపోయింది.