అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు ప్రభాస్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, ఇప్పుడు ప్రభాస్‌కి వీరాభిమాని అయిపోయింది. ప్రభాస్‌తో కలిసి నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇంతకు ముందు ఈ బ్యూటీ, ఎన్టీయార్‌కి వీరాభిమానని చెప్పడం విన్నాం. బాలీవుడ్‌ బ్యూటీస్‌ ఇలా మాట మార్చేయడం కొత్త కాదు. విద్యాబాలన్‌, నాగార్జునతో నటించాలని ఉందంటూ ఓ సందర్భంలో చెప్పింది. అయితే తమ సినిమాల ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇలాంటి మాటలు చెబుతారు. కానీ ఈ అభిమానంలో నిజమెంతో తెలీదు. అలియా కూడా అంతే. అయితే ప్రబాస్‌ ఇప్పుడు యూనివర్సల్‌ స్టార్‌ కాబట్టి అలియా నిజంగానే ప్రబాస్‌కి ఫిదా అయిపోయి ఉండొచ్చు. మరో వైపు 'బాహుబలి' మేనియా దేశమంతా ఉండటంతో తన వంతుగా అలియా ఈ రకంగా ప్రభాస్‌పై స్పందించిందనుకోవాలేమో కూడా. ఓ తెలుగు సినిమా కోసం అలియాని సంప్రదిస్తే, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రెమ్యునరేషన్‌ చెప్పి, తప్పించుకుందామె. ప్రభాస్‌ కోసం అలియాని ట్రై చేసినా అదే పరిస్థితి రావొచ్చు. ఈ బాలీవుడ్‌ భామల మాటల్ని నమ్మలేం. అయితే తాజాగా ప్రబాస్‌ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ బ్యూటీని ట్రై చేస్తున్న మాట వాస్తవమే. ఒకవేళ అది తెలిసి కూడా ఆలియా ఇలా స్పందించిందో ఏమో తెలీడం లేదు. సుజిత్‌ డైరెక్షన్‌లో ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో' సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పటికే దీపికా, కత్రినా వంటి బాలీవుడ్‌ భామలుండగా, కొత్తగా అలియా పేరు కూడా జాయిన్‌ అవుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS