మహేష్ హీరోయిన్ ఆలియా?

మరిన్ని వార్తలు

మహేష్ రాజమౌళి కాంబోలో ఒక మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఉగాదికి పూజా కార్యక్రమాలు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఉగాదికి కాదు మహేష్ పుట్టిన రోజు నాడు పూజా కార్యక్రమాలు జరుపుతారని సమాచారం. ఈ మూవీ ఇంకా అఫీషియల్ గా ప్రారంభం కాకపోయినా, రోజు కొక అప్డేట్ వస్తోంది. ఈ మూవీ మల్టీ స్టారర్ అని ఒక పుకారు, నాగార్జున గెస్ట్ రోల్ అని, ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా ఉంటారని, విలన్ గా బాలీవుడ్  సూపర్ హీరో హృతిక్ నటిస్తున్నాడని, హీరోయిన్ గా చెల్సియా ఇస్లాన్ నటిస్తున్నారని రక రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు మూవీ టీమ్ వీటి పై స్పందించలేదు. 


అయినా ర్యూమర్స్ ఆగటం లేదు. ఇప్పుడు కూడా అలాంటి వార్తే ఇంకొకటి బయటికి వచ్చింది. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటించనున్నారని, RRR  సినిమాలో ఆలియా నటన నచ్చటంతో జక్కన్న మళ్ళీ ఆలియా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో అనుష్క తప్ప ఇంకే హీరోయిన్ ఆయనతో రెండో సారి వర్క్ చేయలేదు. ఇప్పుడు ఆలియా జక్కన్న మనసు గెల్చుకుని, ఈ సూపర్ కాంబో మూవీకి సెలెక్ట్ అయినట్టు సంచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే మహేష్, ఆలియా జోడి సూపర్ గా ఉంటుందని, ఫాన్స్ సంతోష పడుతున్నారు.      


ఈ మూవీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగుతోందని, మహేష్ పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని తెలుస్తోంది. విల్బర్ స్మిత్ నావల్ ఆధారంగా ఈ మూవీ రూపుదిద్దుకొంటోంది. మహేష్ మూవీలో ఆలియా నటిస్తే, తరవాత సౌత్ లో బిజీ కావటం గ్యారంటీ. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరస అవకాశాలు అందుకుంటూ, పాన్ ఇండియా మూవీస్ లో భాగం అవుతోంది. ఇప్పుడు ఆలియా కూడా అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS