'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఈ భామకు బాలీవుడ్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ తెలుగులో నటించకపోయినా, టాలీవుడ్‌లోనూ ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తొలి సినిమాగా 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్న అలియాభట్ త్వరలో ఫిట్‌నెస్ వ్లోగర్‌గా మారనుందట. ఇటీవలే ఈ భామ ఓ యూ ట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన చాలా కొద్ది టైమ్‌లోనే ఏకంగా 10 లక్షల మంది సబ్ స్రైబర్లు లాగ్ ఇన్ అయిపోయారు.
ఇంకేముంది, ఈ ఛానెల్‌లో అలియా నుండి ఏమేం ఇంట్రెస్టింగ్ న్యూస్ పోస్ట్ అవుతాయా? అంటూ ఆసక్తి మొదలెట్టేశారు వ్యూయర్స్. అందుకే తన ఫాలోవర్స్ కోసం ఫిట్‌నెస్ వ్లోగర్‌గా మారాలనుకుంటోందట అలియా భట్. తన ఛానెల్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించిన టిప్స్ ఇవ్వనుందట. వర్కవుట్స్, యోగా టిప్స్‌తో పాటు, డైటింగ్‌కి సంబంధించి కొన్ని మెనూ టెక్నిక్స్ కూడా సూచించనుందట. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ భామలు ఫిట్‌నెస్ వ్లోగర్స్‌గా తమ తమ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. మరి క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ చెప్పబోయే కొత్త టెక్నిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.