వివాదాస్పద నటిగా శ్రీరెడ్డి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఓ స్టార్ అయిపోయింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్నోసార్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ పాపులారిటీతోనే శ్రీరెడ్డి కొన్ని అవకాశాల్నిచేజిక్కించుకుంది. అయితే... ఇప్పుడు తన పాత్రని తానే పోషించుకుంటోంది. శ్రీరెడ్డిగానే తను తెరపై కనిపించబోతోంది.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'క్లైమాక్స్'. భవానీ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీరెడ్డి ఓ కీలకమైన పాత్రలో నటించింది. నిజ జీవిత పాత్రనే ఇందులోనూ పోషించినట్టు శ్రీరెడ్డి చెబుతోంది. నిజ జీవితంలో ముక్కు సూటి మనిషిగాశ్రీరెడ్డి పేరు తెచ్చుకున్నారు. మా సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు, ఆ పాత్ర అనేక మలుపులకు కారణం అవుతుందని చిత్రబృందం తెలిపింది. శ్రీరెడ్డి కెరీర్‌లో చాలా వివాదాలున్నాయి. వివాదాస్పద అంశాలున్నాయి. అందులో ఫిల్మ్ చాంబర్ ముందు తాను చేసిన అర్థనగ్న ప్రదర్శ మరో సంచనలం. ఇవన్నీ `క్లైమాక్స్`లోనూ కనిపించనున్నాయని సమాచారం.