అందరి దృష్టీ మిల్కీబ్యూటీ పైనే.. ఎందుకంటారా?

మరిన్ని వార్తలు

గ్లామర్‌ తారగా ఓ వెలుగు వెలిగిన తమన్నా, 'లక్ష్మి'గా 'సైరా' నరసింహారెడ్డిలో వీరత్వం ఉట్టిపడే పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏదో జస్ట్‌ గెస్ట్‌ రోల్‌ అనుకున్న ఈ పాత్రను సినిమా విడుదలయ్యే వరకూ చాలా లైట్‌ తీసుకున్నారు. కానీ, విడుదలయ్యాక, ఆమె గురించి మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్‌ అంటూనే తెగ మాట్లాడుకున్నారు. నిజంగానే ఆ పాత్ర తమన్నాకి కెరీర్‌ బెస్ట్‌ రోల్‌ అని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ చెప్పక తప్పదు.

 

ఇదిలా ఉంటే, 'సైరా'లో తమన్నాలో కూడా చాలా మార్పు వచ్చిందట. ఇకపై ఇలాంటి పాత్రలు దొరికితే అస్సలు వదిలిపెట్టకూడదని డిసైడ్‌ అయ్యిందట. అంతేకాదు, సురేందర్‌ రెడ్డికి ఆల్రెడీ తమన్నా అప్లికేషన్‌ పెట్టేసిందట కూడా. సభా ముఖంగానే అది రివీల్‌ చేసింది కూడా. సురేందర్‌ రెడ్డి చేయబోయే తదుపరి చిత్రంలో తనకోసం ఓ చిన్న షాట్‌ అయినా ప్లాన్‌ చేయమని రిక్వెస్ట్‌ చేసింది తమన్నా. అప్పుడెప్పుడో 'రచ్చ' సినిమా టైంలో చిరంజీవికి పెట్టిన అప్లికేషన్‌, ఇప్పుడు 'సైరా' రూపంలో ఆమెని వరించింది. అలాగే, ఇప్పుడు సురేందర్‌ రెడ్డికి పెట్టిన అప్లికేషన్‌ ఎప్పటికి నెరవేరుతుందో. కానీ, ఖచ్చితంగా నెరవేరుతుంది.

 

ఇకపోతే, ప్రస్తుతం తమన్నా చాలా బిజీగా మారిపోయింది. వరుస ప్రాజెక్టులు ఆమె ముందు వచ్చి చేరుతున్నాయట. ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరూ..'లో తమన్నా కోసం ఓ స్పెషల్‌ సాంగ్‌ సిద్దం చేశారు. ఆ స్పెషల్‌ సాంగ్‌ని చాలా చాలా స్పెషల్‌గా చిత్రీకరించబోతున్నారట. అందుకోసం ఓ భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడా నిర్మాతలు, దర్శకులు కూడా తమన్నా వైపు చూస్తున్నారట. తమన్నా ప్రధాన పాత్రలో కథల్ని సిద్ధం చేసేందుకు రైటర్స్‌ కూడా తమ కలాలకు పని చెబుతున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS