నయన్‌ సందడి మళ్లీ మొదలైంది.!

మరిన్ని వార్తలు

'సైరా నరసింహారెడ్డి'లో నరసింహారెడ్డి భార్య 'సిద్ధమ్మ' పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది నయనతార. ఈ దీపావళికి మరో పెద్ద సినిమాతో రాబోతోంది. అదే ఇళయ దళపతి విజయ్‌ నటించిన 'బిగిల్‌' చిత్రం. తెలుగులో 'విజిల్‌' పేరుతో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో 'దర్బార్‌' సినిమాతో సందడి చేయనుంది. రెండూ క్రేజీ ప్రాజెక్టులే.

 

ఈ రెండింటికీ మధ్య ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి నయన్‌ చేతిలో. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న నయనతార, ముంబయ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌తో కలిసి ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొంది. కత్రినా కైఫ్‌ సొంతంగా స్టార్ట్‌ చేసిన ఓ కాస్మోటిక్‌ బ్రాండ్‌ కంపెనీని ప్రమోట్‌ చేసేందుకు నయనతార ముందుకొచ్చింది. కత్రినా కైఫ్‌, నయనతార కాంబినేషన్‌లో రూపొందిన ఈ యాడ్‌ షూట్‌ ఇటీవలే జరిగింది.

 

ఈ సందర్భంగా ఆన్‌ సెట్స్‌లో తీసిన వీడియో ఒకటి కత్రినా తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దక్షిణాది అందాల భామ నయనతారకు థాంక్స్‌.. అంటూ ఈ వీడియో షేర్‌ చేసింది కత్రినా కైఫ్‌. కత్రినా, నయన్‌ సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియో ఇది. నెట్టింట్లో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Presenting @kaybykatrina to all of you. It's truly a dream which has come into existence so beautifully. Thank you to my entire team, Nykaa, Falguni Nayar, Reena Chhabra and everyone for helping me achieve this..so much love to all of you from the bottom of my heart..❤ lastly..always remember, be authentic, be real, be yourself...because #ItsKayToBeYou. NOW OUT IN STORES AND NYKAA.COM (link in bio) @mynykaa #KayByKatrina #KayXNykaa #MakeupThatKares Thank u to all the beautiful women who collaborated with me on this ... you are all truly Queens! @zoieakhtar @anaitashroffadajania @nehwalsaina @therajakumari @kushakapila @jannatzubair29 @urvashi_umrao @andreakevichusa @sanathampi @priyadarshini.96 @anugrahanatarajan @haima_simoes #Nayanthara #Appoorva #Simone

A post shared by Katrina Kaif (@katrinakaif) on

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS