కరోనా కలకలం వల్ల సినిమా విశేషాలూ, అందుకు సంబంధించిన వార్తలూ కరువైపోయాయి. ఉగాది పండక్కీ ఫస్ట్‌లుక్కులేం రాలేదు. రామ్ చరణ్ పుట్టిన రోజు పుణ్యమా అని `ఆర్.ఆర్.ఆర్` టీజర్ బయటకు వచ్చింది. దాంతో సినీ ప్రియులకు కాస్త రిలీఫ్ దొరికింది. ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. అందుకు ముహూర్తం కూడా ఖరారైందని టాక్.
శ్రీరామ నవమి సందర్భంగా గురువారం చిరు లుక్ బయటకు వస్తుందని టాక్. ఈ చిత్రానికి `ఆచార్య` అనే పేరు ఖరారు చేశారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. శ్రీరామ నవమి నాడే ఫస్ట్ లుక్‌తో పాటు, టైటిల్ కూడా బయటకు వస్తుందని తెలుస్తోంది. నిజానికి ఉగాదికే ఫస్ట్ లుక్ రావాల్సింది. కానీ రామ్ చరణ్ `ఆర్.ఆర్.ఆర్` టీజర్ విడుదల చేయడం వల్ల.. కుదర్లేదు. శ్రీరామనవమికి మాత్రం ఆచార్య లుక్ గ్యారెంటీగా వస్తుందని సమాచారం. ఈ సినిమాలో నక్సలైట్ అవతారంలో చిరంజీవి కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లుక్ కూడా దానికి సంబంధించే ఉంటుందని టాక్.