సూర్య కెరీర్‌లో ‘సింగం’ సిరీస్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా చెప్పుకోవాలి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలిసి వర్క్ చేయనుందట. ఆల్రెడీ ఓ స్టోరీ లైన్ సిద్ధమైందట. అయితే, సింగం సిరీస్‌తో ఈ ప్రాజెక్ట్‌కి ఎలాంటి సంబంధం ఉండదంటున్నారు. కానీ, డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో సూర్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి బుట్టబొమ్మ పూజా హెగ్దే పేరు పరిశీలిస్తున్నారట. అప్పుడెప్పుడో తమిళంలో ఓ సినిమాలో నటించింది పూజా హెగ్దే. కానీ, ఆ సినిమా ఆమెకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. దాంతో ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్ వైపు చూడలేదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న పూజా బాలీవుడ్‌లోనూ మరిన్ని కొత్త ప్రాజెక్టులపై సైన్ చేస్తోంది. ఇక ఈ తరుణంలో తమిళ తంబీలు కూడా పూజా హెగ్దేని కోరుకోవడంతో, అక్కడ కూడా పూజా కెరీర్ టర్న్ అయ్యేలానే కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే పూజా హెగ్దే ఇటు తెలుగు, అటు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. మరి, తమిళ తంబీల కోసం టైమ్ కేటాయించగలదా.? అనేది చూడాలి. ప్రస్తుతం తెలుగులో అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర్’ సినిమాలోనూ అలాగే, ప్రబాస్‌తో ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) లోనూ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.