'రంగస్థలం' సినిమాలో కుమార్‌బాబుగా నటించిన యంగ్ హీరో ఆది పినిశెట్టి పాత్రను ప్రీ క్లైమాక్స్‌లో చంపేసి, సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఆది పినిశెట్టి చనిపోయే సీన్ సినిమాకి టర్నింగ్ పాయింట్. అసలు కథకు అదే మూల పాయింట్. అయితే అది 'రంగస్థలం'. ఇప్పుడు 'మహర్షి' విషయానికి వస్తే, 'మహర్షి'లో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రను కూడా ప్రీ క్లైమాక్స్‌లో లేపేస్తారని ఇంతవరకూ ప్రచారం జరిగింది.
అయితే అది నిన్న కన్‌ఫామ్ అయ్యింది. 'మహర్షి' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దిల్‌రాజు చెప్పకనే చెప్పేశారీ మాట. ధియేటర్ నుండి చెమర్చిన కళ్లతో బయటికొస్తారని చెప్పారు. అంటే అది అల్లరి నరేష్ పాత్ర తాలూకు విషయమే అని అర్ధమైపోతోంది. ఇప్పటికే 'మహర్షి' కథ ఇది అంటూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని కథలు నిజంగానే సినిమాకి కనెక్ట్ అయ్యి ఉండడంతో ఆల్రెడీ సినిమాకి సంబంధించిన కథ మొత్తం రివీల్ అయిపోయినట్లే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఎందుకో తెలీదు, 'మహర్షి' యూనిట్‌లో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. కాన్ఫిడెన్స్ లెవల్స్ ఫుల్‌గా ఉన్నాయంటూనే ఎవరికి వారే అసహనం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఏమో మరి, బాక్సాఫీస్ వద్ద 'మహర్షి' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి. కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాంతో పాటే ఫ్యాన్సలో టెన్షన్ కూడా మరింత రెట్టింపయిపోయింది.