జయాపజయాలకు అతీతుడు అల్లరి నరేష్. చకచకా సినిమాలు చేసేయడంలో అల్లరి నరేష్ రూటే సెపరేటు. అంత స్పీడుగా సినిమాలెలా చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. అది అతని ప్రత్యేకత అనుకోవాలంతే. అయితే ఈ మధ్య అల్లరోడి బండి కొంచెం స్లోగానే నడుస్తోంది. అందుకే తన బండికి కొంచెం స్పీడు పెంచాలనుకుంటున్నాడట. ఈ మధ్యే అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సెల్ఫీ రాజా' సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ఒరు వడక్కన్ సెల్ఫీ' అనే సినిమాని అల్లరి నరేష్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. జి. ప్రజీత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ బొప్పన నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన నిఖిల విమల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా నటిస్తోంది. కొత్త భామల్ని పరిచయం చేయడంలో కూడా అల్లరోడు ముందుంటాడు. అల్లరి నరేష్ సినిమాల్లోని హీరోయిన్లు చాలా బాగుంటారు అనే ప్రచారం కూడా ఉంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందట. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ని చాలా అందంగా, కొత్త కోణంలో చూపించబోతున్నారట ఈ సినిమాలో. అలాగే అల్లరి నరేష్ సినిమాలో ఉండాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఉండబోతోందట. అయితే ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా అల్లరోడు స్పూఫ్‌లు చేస్తాడా లేదా అనేది మాత్రం సస్పెన్స్ అట. అన్నట్లు అవసరాల శ్రీనివాస్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు ఈ సినిమాలో.