బాలీవుడ్ కండల వీరుడు, మేచో లుక్‌తో అమ్మాయిల కలల రాకుమారుడు అనిపించుకున్న జాన్ అబ్రహాంతో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతోంది. తాజాగా బాలీవుడ్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఖరారయ్యింది. సినిమా పేరు 'ఛోర్ నిఖాల్‌కే భాగా'. ఇందులో తమన్నా ఎయిర్ హోస్టెస్‌గా హొయలొలికించనుందట. బాలీవుడ్‌లో ఇప్పటికే తమన్నా పలు సినిమాల్లో నటించింది. ఆమె ఇంతవరకూ నటించని పాత్ర ఇది. అలాగే తమన్నాకి చాలా ఇష్టమైన పాత్రట కూడా. అంతేకాదు ఈ పాత్రలో హుందాగా కనిపిస్తూనే అంతకన్నా అందంగా కూడా కనిపిస్తుందట. సౌత్‌లో సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మధ్యనే 'అభినేత్రి' సినిమా చేసింది. ఈ సినిమాతో మూడు బాషల్లోనూ హిట్టు కొట్టింది. హిందీలో 'తూతక్ తూతక్ తూతియా' పేరుతో, తమిళంలో 'దేవి'ల్ పేరుతోనూ ఈ సినిమా రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న తమన్నా ఈ సినిమాతో తనలోని నటిని వెలికి తీసే పాత్రలో మెప్పించింది. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఆమె అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ చేతిలో తెలుగులో బిగ్ ప్రాజెక్టు అయిన 'బాహుబలి ది కన్‌క్లూజన్' ఉంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.