'బ్రీత్ ఆఫ్ నాంది' టీజ‌ర్ విడుద‌ల చేసిన సుప్రీమ్ హీరో సాయి తేజ్

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం నాంది. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి సుప్రీమ్ హీరో సాయి తేజ్ ముఖ్య అతిథిగా వ‌చ్చి `బ్రీత్ ఆఫ్ నాంది` టీజ‌ర్‌ని విడుద‌ల‌చేశారు.

ఈ సంద‌ర్భంగా.. సుప్రీమ్ హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - న‌న్ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించిన `నాంది` టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. న‌రేష్ అన్న సినిమాల్ని ఎప్ప‌టినుంచో ఫాలో అవుతూ వ‌స్తున్నాను. `నేను`, `గ‌మ్యం`, `మ‌హర్షి` సినిమాల్లో ఆయ‌న న‌ట‌న‌ నాకు చాలా ఇష్టం. బ్రీత్ ఆఫ్ నాంది టీజ‌ర్ చాలా బాగుంది. మంచి టీమ్ కుదిరింది. విజ‌య్ నాకు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మూవీ త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 

 

ప్రొడ్యూస‌ర్ స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ - `` నాంది షూటింగ్ పూర్త‌య్యాక మా టీమ్ అంతా క‌లిసి చేస్తోన్న మొద‌టి ప్ర‌మోష‌న్ ఈవెంట్ ఇది. మా బ్రీత్ ఆఫ్ నాంది టీజ‌ర్‌ని విడుద‌ల‌చేసిన సాయితేజ్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. సినిమా ఇంత బాగా రావ‌డానికి మా టీమ్ కృషి ఎంతో ఉంది. క‌రోనా స‌మ‌యంలో కూడా ఎంతో రిస్క్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మా సినిమాకు మీడియా ఎంతో స‌పోర్ట్ చేసింది. ఇక ముందు కూడా వారి స‌పోర్ట్ అలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.

 

ద‌ర్శకుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మాట్లాడుతూ - `` ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్స్, ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్ ‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు బ్రీత్ ఆఫ్ నాంది టీజ‌ర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. మా టీమ్‌ని బ్లెస్ చేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్`` అన్నారు.

 

హీరో న‌రేష్ మాట్లాడుతూ - `` 2020లో నా లైఫ్‌లో జ‌రిగిన బెస్ట్ థింగ్ ఈ సినిమా. మామూలుగా ప్ర‌తి సినిమాకు డైరెక్ట‌ర్ బెండ్ తీశారు అంటుంటాం. కానీ ఈ సినిమాలో విజ‌య్ నిజంగానే నా బెండ్ తీశాడు. ఈ సినిమాకు అన్ని మంచి విష‌యాలు కుదిరాయి. అందుకే ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. విజ‌య్ టాలెంట్ ఏంటో షూటింగ్ మొద‌లైన రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది. ఏ షాట్ ఏ యాంగిల్ లో పెట్టాలో పూర్తి నాలెడ్జ్ ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ఇది మా సినిమా అని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వ‌ర్క్ చేశారు. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో చాలా హ్యపీగా ఉన్నాను. చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి న‌న్ను ఆర్టిస్ట్‌గా గుర్తించే సినిమా ఇది. ఇక‌పై కూడా ఇలాంటి క్వాలిటీ సినిమాలే చేయాలి అనుకుంటున్నాను. గ‌మ్యం త‌ర్వాత నాకు మ‌రో మొమ‌ర‌బుల్ మూవీ అవుతుంది. విజ‌య్ మేకింగ్ న‌చ్చి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఇదే బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను`` అన్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో ఎడిట‌ర్ చోటా కె. ప్ర‌సాద్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌ సిద్‌, మాట‌ల ర‌చ‌యిత‌ అబ్బూరి ర‌వి, క‌థా ర‌చ‌యిత‌ తూమ్ వెంక‌ట్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ బ‌్ర‌హ్మ క‌డ‌లి, న‌టులు దేవి ప్ర‌సాద్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన నాంది పోస్టర్ (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్) కు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS